ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు మరో దెబ్బ, భారత్‌తో జరిగే తొలి టెస్టుకు గాయాలతో దూరమైన పేసర్‌ సీన్‌ అబాట్‌

క్రికెట్ ఆస్ట్రేలియాకు మరో బ్యాడ్ న్యూస్. భారత్ తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు రెడీ అవుతోన్న ఆస్ట్రేలియా జట్టులో మరో స్టార్ ప్లేయర్ జట్టు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి..

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు మరో దెబ్బ,  భారత్‌తో జరిగే తొలి టెస్టుకు గాయాలతో దూరమైన పేసర్‌ సీన్‌ అబాట్‌

Updated on: Dec 15, 2020 | 3:25 PM

క్రికెట్ ఆస్ట్రేలియాకు మరో బ్యాడ్ న్యూస్. భారత్ తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు రెడీ అవుతోన్న ఆస్ట్రేలియా జట్టులో మరో స్టార్ ప్లేయర్ జట్టు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. ఆస్ట్రేలియా పేసర్ సీన్‌ అబాట్‌ గాయాల బారినపడి తొలి టెస్టు మ్యాచ్ ఆడటంలేదు. కాలి పిక్క కండరాల నొప్పితో బాధపడుతుండటంతో డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా జరిగే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో అబాట్ ఆడే అవకాశం లేకపోయింది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పుకోవ్‌స్కీతో పాటు ఆల్‌రౌండర్ గ్రీన్, బౌలర్లు హెన్రీ కాన్వే, జాక్సన్ బర్డ్, గాయాలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పేసర్‌ సీన్‌ అబాట్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌కు జట్టులో చోటు కల్పించారు. సెకండ్ టెస్ట్ నాటికి అబాట్ అందుబాటులోకి వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. కాగా, తొడ కండరాల గాయంతో రెండో ప్రాక్టీస్ గేమ్‌కు దూరమైన హెన్రిక్స్.. నాలుగేళ్ల తర్వాత ఆసీస్ టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.