ఇళ్లలోనే బోనాలు.. ఆలయాల్లో అనుమతి లేదు..

|

Jul 08, 2020 | 5:02 PM

హైదరాబాద్‌లో బోనాల పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సీపీ అంజనీకుమార్ సూచించారు. ఎవరూ కూడా బోనాలతో దేవాలయాలకు రావొద్దని అన్నారు. ఈసారి గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి....

ఇళ్లలోనే బోనాలు.. ఆలయాల్లో అనుమతి లేదు..
Follow us on

Bonalu Should be Maintained at Home : హైదరాబాద్‌లో బోనాల పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సీపీ అంజనీకుమార్ సూచించారు. ఎవరూ కూడా బోనాలతో దేవాలయాలకు రావొద్దని అన్నారు. ఈసారి గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి.. లాల్ దర్వాజ దేవాలయాల్లో బోనాల సమర్పణ లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో గతంలో మాదిరిగా కాకుండా పరిమిత సంఖ్యలో భక్తుల్ని అమ్మవారి ఆలయాలకు అనుమతించాలని అధికారులు ఆదేశించారు. రంగం మాత్రం యదావిధిగా జరుగనుంది.

అయితే.. ప్రతిష్ఠాత్మక గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు జూన్ 25న ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే ముందుగా బోనాల ఉత్సవాలు ఇక్కడే మొదలై చివరగా ఇక్కడే ముగుస్తాయి. ఇది ఆనవాయిగా భాగ్యనగరంలో ఏళ్లుగా వస్తున్న ఆచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది బోనాల జాతర నిర్వహణకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తోంది.