Covid-19 Alert: కొవిడ్‌ అలర్ట్‌…ఏపీలో స్టేట్‌ కంట్రోల్‌ సెంటర్‌

|

Feb 15, 2020 | 3:51 PM

ఏపీలో ఇప్పటి వరకు ఒక్క కొవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ వైరస్‌ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యల్ని మరింత వేగవంతం చేసిందన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా రాష్ట్రస్థాయి కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కరోనా బాధిత దేశాల నుంచి ఇప్పటి వరకు ఏపీకి 130 మంది ప్రయాణికులు రాగా..వారిలో 125 మంది వారి ఇళ్లలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. […]

Covid-19 Alert: కొవిడ్‌ అలర్ట్‌...ఏపీలో స్టేట్‌ కంట్రోల్‌ సెంటర్‌
Follow us on

ఏపీలో ఇప్పటి వరకు ఒక్క కొవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ వైరస్‌ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యల్ని మరింత వేగవంతం చేసిందన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా రాష్ట్రస్థాయి కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కరోనా బాధిత దేశాల నుంచి ఇప్పటి వరకు ఏపీకి 130 మంది ప్రయాణికులు రాగా..వారిలో 125 మంది వారి ఇళ్లలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. మరో ఐదుగురికి 28 రోజుల పర్యవేక్షణ పూర్తైనట్లుగా తెలిపారు. ఆరుగురి శాంపిల్స్‌ని నిర్ధారణ కోసం పంపించగా…నెగటివ్ అని తేలిందన్నారు.

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యల్ని చేపట్టామని జవహర్‌రెడ్డి తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ప్రభుత్వం జారీ చేసే ఆరోగ్య సలహాల్ని తప్పకుండా పాటించాలని, ఏమాత్రం అశ్రద్ధ చెయ్యొద్దని సూచించారు. రాష్ట్రంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కొవిడ్‌ సమాచారం తెలిసిన రోజు నుంచే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని, పూర్తి స్థాయిలో ముందస్తు చర్యల్ని చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్‌ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకోగానే 28 రోజుల పాటు తమతమ ఇళ్లలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, బయటికి రావొద్దని జవహర్‌రెడ్డి సూచించారు. కుటుంబ సభ్యులు, ఇతరులకు దూరంగా ఉండాలని, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలుంటే మాస్కల్‌ల కోసం సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని కోరారు. 24 గంటలూ అందుబాటులో ఉండే స్టేట్‌ కంట్రోల్‌ సెంటర్‌ నెం.0866 2410978కు లేదా, 1100, 1902 టోల్‌ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. సోషల్‌ మీడియాలో గానీ, మరే ఇతర మాద్యమాల ద్వారా గానీ ప్రచారమయ్యే వదంతుల్ని నమ్మొద్దని సూచించారు.