Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలి, కంపెనీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ సూచన

| Edited By: Pardhasaradhi Peri

Feb 06, 2021 | 4:42 PM

కోవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న దేశాలు దీన్ని మరింతగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ సూచించారు..

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలి, కంపెనీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ సూచన
Follow us on

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న దేశాలు దీన్ని మరింతగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ సూచించారు. ఆయా దేశాలు తమ టీకా పంపిణీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం వీటి డోసులను పంచుకోవాలని కూడా ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ డోసులు..వైరస్ ఇన్ఫెక్షన్లను మించిపోయాయన్నారు. అంటే..ఇన్ఫెక్షన్లు తగ్గాయని, అదే సమయంలో టీకామందుల వినియోగం పెరిగిందని పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు కేవలం 10 దేశాల్లో మూడువంతులు పైగా ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారని, మరిన్ని దేశాలు, మరింతమంది ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. సుమారు 130 దేశాల్లో రెండు వందల కోట్ల మందికిపైగా ప్రజలు ఇప్పటికీ సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకోవలసి ఉందని ఆయన వ్యాఖ్యానించినట్టు చైనాకు చెందిన సిన్ హువా వార్తా సంస్థ తెలిపింది. తమ ప్రజలను కాపాడే బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందని టెడ్రోస్ పేర్కొన్నారు.

తమ సొంత హెల్త్ వర్కర్లకు, వృధ్ధులకు టీకామందులు వేయించిన ప్రభుత్వాలు ఇతర వర్గాల ప్రజలను కూడా రక్షించుకోవలసి ఉందని ఆయన చెప్పారు. మనం ప్రతి చోటా వైరస్ ను పూర్తిగా నిర్మూలించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న దేశాలు దీన్ని పెంచుకోవాలి.. అలాగే ఇతర కంపెనీలు కూడా తమ స్వంత టీకామందులను ఉత్పత్తి చేసేలా ఇవి  నాన్-ఎక్స్ క్లూజివ్ లైసెన్సులను జారీ చేయాలి అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ఇందువల్ల పేద దేశాలు విరాళాల కోసం ధనిక దేశాలపై ఆధారపడడం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

Read More:

Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికే ప్రమాదకరం: రాహుల్ గాంధీ

తెలంగాణ డీజీపీకి కోవిడ్‌ టీకా.. టీకాపై అనుమానాలు, ఆపోహాలు అక్కర లేదన్న మహేందర్‌రెడ్డి

బీహెచ్ఈఎల్ మరో ఘనత.. మధ్యప్రదేశ్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్‌క్రిటికల్‌ ప్లాంట్‌