Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో కోవిడ్ టీకా పొందిన వారికి రెండో డోస్‌ను ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషన్ తెలిపారు. తొలి విడత తీసుకున్న లబ్ధిదారులందరూ తప్పకుండా 28 రోజుల తరువాత రెండో డోస్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 13 నుంచి టీకా రెండో డోస్ ప్రక్రియ మొదలవుతుందని, లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో మొదటి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు టీకా తీసుకోని హెల్త్ కేర్ వర్కర్లు, ఇతర సిబ్బంది ఈ నెల 25వ తేదీలోగా మొదటి విడత టీకా తీసుకోవాలని సూచించారు. ఆ తేదీ దాటిన తరువాత వచ్చిన వారికి టీకా వేయరని స్పష్టం చేశారు. ఇక ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి మార్చి 5వ తేదీ వరకు మొదటి విడత వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు.
Also read:
YS Sharmila New Party: తెలంగాణ వైఎస్ షర్మిల కొత్త పార్టీ.. ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పందన ఇదీ..
అన్నదాతల ‘ఉగ్ర రూపం’, ఈ నెల 18 న దేశవ్యాప్తంగా 4 గంటలపాటు రైల్ రోకో ఆందోళన