Breaking: ఆర్బీఐ కీలక ప్రకటన.. రుణ చెల్లింపుదారులకు ఊరట..

|

Mar 27, 2020 | 10:53 AM

COVID 19: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపధ్యంలో ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన చేశారు. రివర్స్ రెపో రేటు 90 బేసిక్ పాయింట్లు, రెపో రేటు 75 బేసిక్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో రెపో రేటు 4.4 శాతానికి తగ్గిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్న ఆయన.. ఆర్ధిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను నిశితంగా […]

Breaking: ఆర్బీఐ కీలక ప్రకటన.. రుణ చెల్లింపుదారులకు ఊరట..
Follow us on

COVID 19: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపధ్యంలో ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన చేశారు. రివర్స్ రెపో రేటు 90 బేసిక్ పాయింట్లు, రెపో రేటు 75 బేసిక్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో రెపో రేటు 4.4 శాతానికి తగ్గిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్న ఆయన.. ఆర్ధిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇక ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

మరోవైపు రుణాల చెల్లింపుల విషయంలో కూడా ఆర్బీఐ శుభవార్త అందించింది. బ్యాంకులతో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థలు అన్ని రకాల లోన్ లపై ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ఆర్బీఐ గవర్నర్ సూచించారు. రుణ చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు సహరిస్తామని చెప్పిన ఆయన.. ఆర్బీఐలో పని చేసే 150 మంది ఉద్యోగులు క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు.

For More News:

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?

కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?

కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?

కరోనా విలయం.. స్విట్జర్లాండ్‌కు ఫెదరర్ భారీ సాయం..

దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?