AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు ట్రక్కుల్లో 300 మంది వర్కర్లు.. షాక్ తిన్న మహారాష్ట్ర పోలీసులు

రెండు కంటెయినర్ ట్రక్కుల్లో 300 మంది వర్కర్లను చూసిన మహారాష్ట్ర పోలీసులు షాక్ తిన్నారు. వీరంతా తెలంగాణ నుంచి రాజస్తాన్ కు నిత్యావసర సరకులను తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది.

రెండు ట్రక్కుల్లో 300 మంది వర్కర్లు.. షాక్ తిన్న మహారాష్ట్ర పోలీసులు
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 11:09 AM

Share

రెండు కంటెయినర్ ట్రక్కుల్లో 300 మంది వర్కర్లను చూసిన మహారాష్ట్ర పోలీసులు షాక్ తిన్నారు. వీరంతా తెలంగాణ నుంచి రాజస్తాన్ కు నిత్యావసర సరకులను తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రానికి చెందిన వీరు తమ సొంత ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రమాదకరమైన ఇలాంటి పధ్దతిని ఎంచుకోవడం ఖాకీలను విస్మయానికి గురి చేసింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అనేకమంది దినసరి కూలీలు, కార్మికులు ఈ విధంగా అడ్డదారులు వెతుక్కుంటున్నట్టు కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. తెలంగాణ నుంచి ఈ రెండు ట్రక్కులు యావత్ మల్ జిల్లాకు చేరుకోగా.. తనిఖీ కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఈ వాహనాలను ఆపివేసినప్పుడు వీటిలో కుక్కివేసినట్టున్న ఈ కార్మికులు కనబడ్డారు. రాజస్తాన్ పంధార్ కావడ వద్ద టోల్ గేట్ బూత్ సిబ్బంది.. ఈ ట్రక్కులను చూసి.. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారని ఈ వాహనాల డ్రైవర్లను ప్రశ్నించగా.. వారు సరైన సమాధానాలు ఇవ్వలేక తడబడ్డారట. దీంతో అనుమానం వఛ్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ట్రక్కు డ్రైవర్లపై ఖాకీలు చర్యలకు ఉపక్రమించారు. అయితే దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ 300 మంది వర్కర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక  అధికారులు అయోమయంలో ఉన్నారు.

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ