భారత్‌లో పెరుగుతున్న కరోనా రికవరీ రేట్

|

Oct 13, 2020 | 7:58 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యకు సమానంగా కోలుకుంటున్నవారి సంఖ్య సరి సమానంగా ఉంటుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

భారత్‌లో పెరుగుతున్న కరోనా రికవరీ రేట్
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యకు సమానంగా కోలుకుంటున్నవారి సంఖ్య సరి సమానంగా ఉంటుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 62లక్షలు దాటిందని, ప్రపంచంలోనే ఇది అత్యధికమని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. ప్రస్తుతం క్యుమిలేటివ్‌ పాజిటివిటీ రేటు 8.07శాతం నమోదు కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 6.24శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 5.16శాతంగా ఉందని తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై మీడియా సమావేశంలో మాట్లాడారు.

వరుసగా ఐదో రోజూ యాక్టివ్‌ కేసుల సంఖ్య 9లక్షల కంటే తక్కువగానే ఉందని, యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,75,881 కి చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 62,27,296 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 8,38,729 క్రియాశీలక కేసులు ఉన్నాయి. వారంతా వివిధ ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇక ఇప్పటివరకు 1,09,856 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 8,89,45,107 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది.