ఆ 18 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తక్కువే..

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గడం లేదు. కేవలం ఏడున్నర రోజుల్లో కోవిడ్-19 కేసులు కేవలం రెట్టింపు

ఆ 18 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తక్కువే..

Edited By:

Updated on: Apr 21, 2020 | 4:53 PM

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గడం లేదు. కేవలం ఏడున్నర రోజుల్లో కోవిడ్-19 కేసులు కేవలం రెట్టింపు పెరిగాయి. అయితే దేశంలోని 18 రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అంతగా లేదని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల చాలా మందగమనంలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. దేశ పెరుగుదల రేటుతో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో అతి తక్కువ పెరుగుదల ఉంది.

అయితే.. భారత్ లో కోవిద్-19 కేసులు గత కొద్ది రోజులుగా ఎక్కువయ్యాయి. ఈ ఎక్కువగా మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. మంగళవారం దేశ వ్యాప్తంగా 1274 కేసులు నమోదు అవ్వగా అందులో 466 కేసులు కేవలం మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. గుజరాత్‌లో కూడా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత ఈరోజు ఎక్కువ కేసులు నమోదు అయ్యింది గుజరాత్‌లోనే. ఈరోజు గుజరాత్‌లో ఇప్పటి వరకు 100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఢిల్లీలో 78 కేసులు నమోదు అయ్యాయి.