Covid 19: కరోనావైరస్ నేపథ్యంలో.. టిక్‌టాక్ ‘హ్యాండ్‌వాష్’ డ్యాన్స్.. యునిసెఫ్ ఫిదా!
చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన

Covid 19: చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వియత్నాం డ్యాన్సర్ క్యాంగ్ డ్యాంగ్ తన సహచరుడితో కలిసి చేసిన ‘హ్యాండ్ వాష్’పై అవగాహన కలిగిస్తూ రూపొందించిన టిక్‌టాక్ వీడియో.. ఇప్పుడు నెటిజనులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మరోవైపు.. ఈ వీడియోకు యునిసెఫ్ (UNICEF) కూడా ఫిదా అయ్యింది. దీన్ని ట్వీట్ చేసి మరీ వారిని అభినందించింది.
[svt-event date=”04/03/2020,8:25PM” class=”svt-cd-green” ]
We love this handwashing dance from Vietnamese dancer, Quang Đăng.
Washing your hands with soap and water is one of the first steps to protect yourself from #coronavirus. pic.twitter.com/lmXLbR3hZa
— UNICEF (@UNICEF) March 3, 2020
[/svt-event]