భర్తపై పోలీస్ కేసు పెట్టిన భార్య.. స్టేషన్‌లో జరిగిన సీన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Couple Fight In Police Station: ఇద్దరు భార్యాభర్తలు మధ్య చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా పెద్దదైంది. పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఈ మొగుడు నాకొద్దంటూ కేసు పెట్టింది ఆ భార్య. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా లాభం లేకుండాపోయింది. తన భార్య కోపాన్ని ఎలా పోగొట్టాలో తనకు తెలుసు అని భర్త రంగంలో దిగి పాట పాడాడు. అవునండీ మీరు విన్నది నిజమే. ఒక అద్భుతమైన పాట పాడాడు. అంటే […]

భర్తపై పోలీస్ కేసు పెట్టిన భార్య.. స్టేషన్‌లో జరిగిన సీన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Updated on: Jul 18, 2020 | 8:25 PM

Couple Fight In Police Station: ఇద్దరు భార్యాభర్తలు మధ్య చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా పెద్దదైంది. పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఈ మొగుడు నాకొద్దంటూ కేసు పెట్టింది ఆ భార్య. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా లాభం లేకుండాపోయింది. తన భార్య కోపాన్ని ఎలా పోగొట్టాలో తనకు తెలుసు అని భర్త రంగంలో దిగి పాట పాడాడు. అవునండీ మీరు విన్నది నిజమే. ఒక అద్భుతమైన పాట పాడాడు. అంటే భార్య కోపం పోయింది.. ఇద్దరూ కలిసిపోయారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు.. భార్య భర్తపై పోలీస్ కేసు పెట్టింది. దీనితో పోలీసులు భర్తను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. తన భార్య తనకు కావాలంటూ భర్త.. ఈ మొగుడు నాకొద్దంటూ భార్య.. గొడవపడుతుంటే.. ఇద్దరినీ కౌన్సిలింగ్‌కు అటెండ్ కావాలని పోలీసులు తెలిపారు. కౌన్సిలింగ్‌లో ఎంత నచ్చచెప్పినా భార్య వినకపోవడంతో.. భర్త హీరో మాదిరిగా ‘బద్లాపూర్’ సినిమాలోని పాటను అందుకున్నాడు. భర్త పాటకి అందరూ షాక్ కాగా.. భార్య మాత్రం తన్మయత్వంతో తన భుజంపై వాలిపోయి కన్నీటిపర్యంతమైంది. ఇలా వీరిద్దరి ప్రేమ సుఖాంతమైంది. ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ మధుర్ వర్మ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది.