ప్రపంచంలో ఆరో స్థానానికి భారత్.. ఇటలీని మించేసిన కరోనా విలయం..

|

Jun 06, 2020 | 10:36 AM

ప్రపంచంలోనే కరోనాతో తీవ్రమైన ప్రభావితమైన దేశాల్లో ఒకటి ఇటలీ. అక్కడ ఇప్పటివరకు 234,531 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33,774 మరణాలు సంభవించాయి. ఇప్పుడు ఆ దేశాన్ని కూడా భారత్ దాటేసింది.

ప్రపంచంలో ఆరో స్థానానికి భారత్.. ఇటలీని మించేసిన కరోనా విలయం..
Follow us on

దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 9,887 పాజిటివ్ కేసులు, 294 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా కేసుల సంఖ్య 2,36,657కి చేరింది. ఇందులో 1,15,942 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,14,073 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 6642 కరోనా మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.

మహారాష్ట్రలో కరోనా విలయం..

మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,436 పాజిటివ్ కేసులు, 139 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా కేసుల సంఖ్య 80,229కి చేరగా.. 2849 మంది కరోనా కారణంగా మరణించారు. అటు ఢిల్లీ, తమిళనాడు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తమిళనాడులో ఇప్పటివరకు 28,694 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 232 మృత్యువాతపడ్డారు. అత్యధిక కేసులు చెన్నైలోనే నమోదవుతున్నాయి. ఇక ఢిల్లీలో 26,334 కరోనా కేసులు, 708 మరణాలు సంభవించాయి. అటు గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.

ఇటలీని దాటేసిన భారత్…

ప్రపంచంలోనే కరోనాతో తీవ్రమైన ప్రభావితమైన దేశాల్లో ఒకటి ఇటలీ. అక్కడ ఇప్పటివరకు 234,531 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33,774 మరణాలు సంభవించాయి. ఇప్పుడు ఆ దేశాన్ని కూడా భారత్ దాటేసింది. మన దేశంలో ఇప్పటివరకు 2,36,657 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో ప్రపంచంలో ఆరో స్థానానికి భారత్ చేరుకుంది.

Also Read:

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

ఏపీలో మరిన్ని సడలింపులు.. ఆలయాలు, హోటల్స్, మాల్స్‌కు నయా రూల్స్…

కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!