చైనాలో మళ్ళీ కరోనా ‘కాటు’, కోలుకున్న రోగులకూ తప్పని ‘పోటు’

| Edited By: Anil kumar poka

Aug 06, 2020 | 12:17 PM

చైనాలో..ముఖ్యంగా వూహాన్ నగరంలో కరోనా వైరస్ సెకండ్ 'సీజన్' మొదలైనట్టు కనిపిస్తోంది. ఈ సిటీలో కరోనా నుంచి కోలుకున్న 90 శాతం మంది రోగుల ఊపిరితిత్తుల డ్యామేజీ సోకినట్టు తెలుస్తోంది.

చైనాలో మళ్ళీ కరోనా కాటు, కోలుకున్న రోగులకూ తప్పని పోటు
Follow us on

చైనాలో..ముఖ్యంగా వూహాన్ నగరంలో కరోనా వైరస్ సెకండ్ ‘సీజన్’ మొదలైనట్టు కనిపిస్తోంది. ఈ సిటీలో కరోనా నుంచి కోలుకున్న 90 శాతం మంది రోగుల ఊపిరితిత్తుల డ్యామేజీ సోకినట్టు తెలుస్తోంది. వీరిలో మళ్ళీ 5 శాతం మంది కరోనా పాజిటివ్ కి గురికాగా వారిని తిరిగి క్వారంటైన్ కి తరలించారు. వూహాన్ లోని ప్రముఖ ఆసుపత్రి వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ వైరస్ నుంచి వంద శాతం కోలుకున్న రోగులను గత ఏప్రిల్ నుంచి పరీక్షిస్తూ వస్తున్నామని, వారి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ లో టెస్ట్ చేసిన అనంతరం.. వారి లంగ్స్ కొంతవరకు దెబ్బ తిన్నట్టు గుర్తించామని వూహాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఈ హాస్పిటల్ డైరెక్టర్ ఒకరు తెలిపారు.

90 శాతం మంది రోగుల ఊపిరి తిత్తులు పాడైనట్టు గుర్తించాం.. ఆరోగ్యవంతుల లంగ్స్ స్థాయికి ఇవి ఇంకా చేరలేదు అని ఆ డైరెక్టర్ వెల్లడించారు. కోలుకున్న రోగులు ఆరు నిముషాల్లో కేవలం  400 మీటర్లు నడవగా, ఆరోగ్యవంతులు ఇదే సమయంలో 500, 600 మీటర్లు కూడా నడవగలిగారని ఆయన చెప్పారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఆయిన మూడు నెలల తరువాత కూడా కొంతమంది రోగులకు ఆక్సిజన్ మెషిన్స్ అవసరమయ్యాయని, వందమంది రోగుల్లోని యాంటీ బాడీలు 10 శాతం కనుమరుగయ్యాయని ఈ ఆస్పత్రివర్గాలు తెలిపాయి. వూహాన్ సిటీనుంచే కరోనా వైరస్ పుట్టిందని ప్రపంచమంతా గొంతు చించుకుంటున్న విషయం విదితమే.