కరోనా అప్డేట్: ఏపీలో కొత్త కేసులు ఎన్నంటే.?

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 3:02 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 25,778 సాంపిల్స్‌ను పరీక్షించగా 813 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కరోనా అప్డేట్: ఏపీలో కొత్త కేసులు ఎన్నంటే.?
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 25,778 సాంపిల్స్‌ను పరీక్షించగా 813 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో రాష్ట్రానికి చెందినవి 755 కేసులు కాగా, ఇతర రాష్ట్రాలకు , విదేశాల నుంచి వచ్చినవారి 58 మందికి కరోనా సోకింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,098కి చేరింది.

అందులో 7021 యాక్టివ్ కేసులు ఉండగా, 5,908 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 401 మంది కోవిడ్ 19 నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. కర్నూలులో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు. దీనితో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 169 కరోనా మరణాలు సంభవించాయి. కాగా, జిల్లాల వారీగా నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. అనంతపురం 51, పశ్చిమ గోదావరి 71, గుంటూరు 90, కర్నూలు 103, ప్రకాశం 41, చిత్తూరు 82, విజయనగరం 8, విశాఖపట్నం 44, కృష్ణా 79, నెల్లూరు 18, తూర్పుగోదావరి 57 కేసులు నమోదయ్యాయి.

ఇది చదవండి: బ్రేకింగ్: కరోనా బాధితుల్లో మరో ‘మూడు’ కొత్త లక్షణాలు..