దేశంలో కరోనా: కోలుకున్నవారు 14,27,005.. యాక్టివ్ కేసులు 6,19,088

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 61,537 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 933 మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా: కోలుకున్నవారు 14,27,005.. యాక్టివ్ కేసులు 6,19,088

Updated on: Aug 08, 2020 | 11:51 AM

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 61,537 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 933 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,088,612కి చేరుకుంది. ఇందులో 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా.. 42,518 మంది కరోనాతో మరణించారు. అటు గడిచిన 24 గంటల్లో 48,900 మంది డిశ్చార్జ్ కావడంతో.. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు 14,27,005 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే దేశంలో వరుసగా రెండు రోజు 60,000 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. అటు కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించాయి. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 67.98 శాతం ఉండగా.. మరణాల రేటు 2.05 శాతంగా ఉంది.

Also Read: పాపులర్ సీఎంల లిస్ట్: మూడో స్థానంలో వైఎస్ జగన్.!

 

Loading...
Unable to load recommendations.
Follow Us