దేశంలో 19 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు..

|

Aug 05, 2020 | 10:47 AM

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 52,509 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 857 మరణాలు సంభవించాయి.

దేశంలో 19 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు..
Follow us on

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 52,509 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 857 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,08,255కి చేరుకుంది. ఇందులో 5,86,244 యాక్టివ్ కేసులు ఉండగా.. 39,795 మంది కరోనాతో మరణించారు. అటు12,82,216 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో వరుసగా ఏడో రోజు 50,000 పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఎక్కువగా మహారాష్ట్ర, న్యూఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రోజూ 5 వేలు పైచిలుక కేసులు నమోదవుతున్నాయి. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. అటు కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించాయి. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 67.19 శాతంలో ఉండగా.. డెత్ రేట్ 2.09 శాతంలో ఉంది.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..