
కొత్తవైరస్ స్ట్రెయిన్ తెలుగురాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే బ్రిటన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వారిని అధికారులు గుర్తిస్తున్నారు. తాజాగా కృష్ణజిల్లాకు బ్రిటన్ నుంచి 116 మంది వచ్చినట్టు అధికారులు గుర్తించారు. పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ సెంటర్లకు అధికారులు తరలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకోసం ప్రత్యేకంగా బెడ్లను ఏర్పాటు చేశారు. 300 ప్రత్యేక బెడ్లలో 150 కరోనా బెడ్లు, 150 నాన్ కరోనా బెడ్లను ఏర్పాటు చేసారు. దీనితో పాటు కృష్ణా జిల్లా గూడవల్లి క్వారంటైన్ సెంటర్‌తో పాటు ఈడ్పుగల్లు క్వారంటైన్ సెంటర్‌ను సైతం పున: ప్రారంభించారు. అదే విధంగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి మచిలీపట్నానికి చేరుకున్నవారి వివరాలను అధికారులు స్వీకరించనున్నారు. వారికి పరీక్షలు నిర్వహించి అనంతరం క్వారంటైన్ సెంటర్లకు పంపనున్నారు.