కరోనాకు కనికరం ఉండదా.. మళ్లీ మళ్లీ సోకుతుందా..?

|

Aug 30, 2020 | 12:45 PM

ఒకవైపు వైరస్‌ సోకిన వారి సంఖ్య పెరుగుతుండగా, చికిత్స తర్వాత వ్యాధి నుంచి బైటపడిన వారి సంఖ్య కూడా బాగానే పెరుగుతోంది. కాగా, ప్రస్తుతం ప్రపంచం దృష్టి కరోనా రీఇన్ఫెక్షన్‌పై పడింది. రెండోసారీ కరోనా సోకుతుందేమోననే అనుమానం ప్రజల్లో బయలు దేరింది. హాంగ్‌కాంగ్‌లో తొలిసారిగా ఇటువంటి కేసు ఒకటి బయటపడింది.

కరోనాకు కనికరం ఉండదా.. మళ్లీ మళ్లీ సోకుతుందా..?
Follow us on

చైనాలో పురుడుపోసుకున్న కరోనా రాకాసి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. బహిరంగ ప్రదేశాలతో పాటు ఎండపొర కూడా తగల ప్రదేశాల్లోని వారిని సైతం వదలడంలేదు. దేశంలో క‌రోనా పీడితులు 35 లక్షలకు పైగా చేరారు. ఇందులో 7,65,302 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 27,13,934 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది.

అయితే, ఒకవైపు వైరస్‌ సోకిన వారి సంఖ్య పెరుగుతుండగా, చికిత్స తర్వాత వ్యాధి నుంచి బైటపడిన వారి సంఖ్య కూడా బాగానే పెరుగుతోంది. కాగా, ప్రస్తుతం ప్రపంచం దృష్టి కరోనా రీఇన్ఫెక్షన్‌పై పడింది. రెండోసారీ కరోనా సోకుతుందేమోననే అనుమానం ప్రజల్లో బయలు దేరింది. హాంగ్‌కాంగ్‌లో తొలిసారిగా ఇటువంటి కేసు ఒకటి బయటపడింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రెండోసారి కరోనా బారినపడతామా అనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా ఎంతవరకు అదుపుచేయగలుతుందన్న వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు.

హాంగ్‌కాంగ్‌కు చెందిన 33 ఏళ్ల యువకుడొకరు రెండోసారి కరోనా బారిన పడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా గుబులు మొదలైంది. మళ్లీ వైరస్ కాటుకు గురవుతామోనని బెంగపట్టుకుంది. అయితే, రెండు సందర్భాల్లోనూ రెండు భిన్నమైన వైరస్‌ల ద్వారా అతడు వ్యాధి బారిన పడ్డాడని శాస్త్రవేత్తలు నిరూపించారు. వైరస్‌ల జన్యుక్రమం పరిశీలించిన అనంతరం వారు ఈ నిర్ణయానికి వచ్చారు.

రెండోసారి కరోనా కారణంగా సదరు వ్యక్తిలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధన ప్రకారం.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో రోగ నిరోధక శక్తి బలం పుంజుకుంటుంది. కరోనాను నిరోధించే యాంటీబాడీలు శరీరంలో అభివృద్ధి చెందుతాయి. అంతే కాకుండా.. మరోసారి శరీరంలోకి కరోనా ప్రవేశిస్తే గుర్తుపట్టేందుకు వీలుగా మెమరీ టీ, బీ కణాలు కూడా అభివృద్ధి చెందుతాయని సైంటిస్టులు వెల్లడించారు.

అయితే, కోలుకున్న 2-3 నెలల తరువాత శరీరంలోని కరోనా నిరోధక యాంటీబాడీలు సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సమయంలో కరోనా పరీక్ష జరిపితే పాటిజిటివ్ అనే వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలి ఇన్ఫెక్షన్‌కు సంబంధించి శరీరం ఇంకా వైరస్‌లను విడుదల చేస్తుందని, దీని కారణంగానే పాటిజిటివ్ వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో వ్యక్తుల్లో కరోనా రోగ లక్షణాలు కనిపించే అవకాశం లేదని వారంటున్నారు. ఇక హాంగ్‌కాంగ్ కేసులో రెండో రకం వైరస్ కారణంగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయినప్పటికీ బాధితుడిలో ఎటువంటి రోగ లక్షణాలూ కనిపించలేదని వారు చెబుతున్నారు.

దీనిపై సీఎస్ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డా. అనురాగ్ అగర్వాల్ మరింత స్పష్టత నిచ్చారు. ‘కరోనా రీఇన్‌ఫెక్షన్ కేసులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అయితే మనం ఇంతవరకూ అసలైన రీఇన్‌ఫెక్షన్ కేసు చూడలేదన్నారు. రెండూసార్లు రోగిలో కరోనా రోగ లక్షణాలు కనిపించిన ఉదంతాలు ఇంతవరకూ నమోదు కాలేదని స్పష్టం చేశారు. తొలిసారి రోగిలో వ్యాధి లక్షణాలు కనపడినా.. రెండోసారి ఎటువంటి అనారోగ్యం బయటపడని ఘటనలు మాత్రమే మనం చూస్తున్నాం. రెండు సార్లూ వ్యాధి లక్షణాలు బయటపడే నిజమైన రిఇన్‌ఫెక్షన్ కేసును మనం ఇప్పటివరకూ చూడలేదు’ అని డా. అనురాగ్ స్పష్టం చేశారు.

రెండోసారి శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తే.. మెమరీ టీ, బీ కణాలు వాటిని గుర్తుపట్టి దాడి చేస్తాయని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. శ్రీనాథ్ స్పష్టం చేశారు. దీంతో రెండో రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని ఆయన వెల్లడించారు.