కరోనా లాక్‌డౌన్: దినసరి కూలీగా గోల్డ్ మెడ‌లిస్ట్..!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఈ క్రమంలో కుంగ్ఫూ క్రీడ‌లో ప్రత్యర్థులను

కరోనా లాక్‌డౌన్: దినసరి కూలీగా గోల్డ్ మెడ‌లిస్ట్..!

Edited By:

Updated on: Jun 27, 2020 | 10:44 AM

Coronavirus forced to wage gold medalist: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఈ క్రమంలో కుంగ్ఫూ క్రీడ‌లో ప్రత్యర్థులను చిత్తుచేసి, బంగారు పతకాలు సాధించిన ఆ యువ‌కుడు ఇప్పుడు కూలి ప‌నుల‌కు వెళ్లాల్సిన దుస్థితికి చేరుకున్నాడు. జాతీయ క్రీడాకారుడైన ధ‌నుంజ‌య్ పొట్ట‌పోషించుకునేందుకు ఇళ్ల గోడ‌ల‌కు పుట్టీ ప‌నులు చేసేందుకు వెళుతున్నాడు. ఇత‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ వుషు(కుంగ్ఫూ)లో తొమ్మిది బంగారు పతకాలు సాధించాడు.

కరోనా లాక్ డౌన్ కారణంగా చాల మంది పరిస్థితి తలకిందులయింది. గోల్డ్ మెడలిస్ట్ ధ‌నుంజ‌య్ కోచ్ సంజీవ్ శుక్లా ఆమ‌ధ్య‌ రెండు పాఠశాలల్లోని పిల్లలకు వుషు నేర్పడానికి అత‌నికి అవ‌కాశం క‌ల్పించారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా పాఠశాలలు మూత‌ప‌డ్డాయి. దీంతో ధ‌నంజ‌య్ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది. దీంతో కూలి ప‌నుల‌కు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ధనంజయ్ కోచ్ సంజీవ్ శుక్లా మాట్లాడుతూ లాక్‌డౌన్ కార‌ణంగా పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌టంతో కోచ్‌లు ఉపాధి కోల్పోయార‌న్నారు. ప్ర‌భుత్వం ఇటువంటివారిని ఆదుకోవాల‌ని కోరారు.