ఏపీని వణికిస్తున్న కరోనా.. వెయ్యి దాటిన మరణాలు.. 

Coronavirus Death Toll In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 47,645 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 7627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. వీటిల్లో 48,956 యాక్టివ్ కేసులు ఉండగా.. 46,301 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1041కి చేరుకుంది. అటు గడిచిన 24 గంటల్లో 3041 […]

ఏపీని వణికిస్తున్న కరోనా.. వెయ్యి దాటిన మరణాలు.. 

Updated on: Jul 26, 2020 | 6:17 PM

Coronavirus Death Toll In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 47,645 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 7627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. వీటిల్లో 48,956 యాక్టివ్ కేసులు ఉండగా.. 46,301 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1041కి చేరుకుంది.

అటు గడిచిన 24 గంటల్లో 3041 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 56 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో 1095, పశ్చిమగోదావరిలో 859 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 734, చిత్తూర్ 573, గుంటూరు 547, కడప 396, కృష్ణ 332, నెల్లూరు 329, ప్రకాశం 242, శ్రీకాకుళం 276, విజయనగరం 247, విశాఖపట్నం 784 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 13,486 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కర్నూలులో 162 కరోనా మరణాలు సంభవించాయి.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల విలువ భారీగా పెంపు.!

ఏపీలోని ఆ ప్రాంతంలో వారం రోజుల లాక్‌డౌన్..

గుడ్ న్యూస్.. కరోనా కట్టడికి మరో 21 మందులు..!

Loading...
Unable to load recommendations.
Follow Us