ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లు దాటిన కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా 25,015,950 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 843,120 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 17,382,721 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లు దాటిన కరోనా కేసులు..

Updated on: Aug 29, 2020 | 10:01 PM

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 25,015,950 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 843,120 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 17,382,721 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా 2,84,898 పాజిటివ్ కేసులు, 5711 మరణాలు సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(6,110,761), మరణాలు(186,291) సంభవించాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 3,513,902 నమోదు కాగా, మృతుల సంఖ్య 63,280కి చేరింది.

Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

Loading...
Unable to load recommendations.
Follow Us