దేశంలో కరోనా.. ఒక్క రోజే 48,861 కేసులు, 705 మరణాలు..

కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 48,661 కరోనా కేసులు, 705 మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,85,522కి చేరింది. 

దేశంలో కరోనా.. ఒక్క రోజే 48,861 కేసులు, 705 మరణాలు..

Updated on: Jul 26, 2020 | 10:37 AM

Coronavirus Cases In India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతుండగా.. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 48,661 కరోనా కేసులు, 705 మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,85,522కి చేరింది.  వీటిల్లో 4,67,882 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,85,577 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 32,063 మంది కరోనాతో మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో 4,42,031 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొదటిసారిగా, ప్రభుత్వ ప్రయోగశాలల్లో 3,62,153 నమూనాలను పరీక్షించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇక ప్రైవేట్ ల్యాబ్ లలో ఒకే రోజులో 79,878 నమూనాలను పరీక్షించారు. కాగా, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.