ప్రపంచ కరోనా అప్డేట్.. నిన్న ఒక్క రోజులో 4,10,120 పాజిటివ్ కేసులు.. 7041 మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ పాజిటివ్ కేసులు...

ప్రపంచ కరోనా అప్డేట్.. నిన్న ఒక్క రోజులో 4,10,120 పాజిటివ్ కేసులు.. 7041 మరణాలు..

Updated on: Dec 28, 2020 | 11:17 AM

Coronavirus Cases World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూపోతోంది. నిన్న ఒక్క రోజు 4,10,120 పాజిటివ్ కేసులు, 7,041 మరణాలు సంభవించాయి. కాగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,144,994కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,771,981 మంది కరోనాతో మరణించారు. ఇక 57,293,765 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (Coronavirus Active Cases In World)

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 19,573,847కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 341,138 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం ‘స్ట్రెయిన్’ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇండియాలో ఇప్పటివరకు 10,208,725 పాజిటివ్ కేసుల కేసులు నమోదు కాగా.. 147,940 మంది వైరస్ కారణంగా మరణించారు. (Coronavirus Cases In World Wide)

Also Read:

హైదరాబాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సోనూసూద్ సందడి.. చెప్పకుండానే అభిమాని ఇంటికి వచ్చిన రియల్ హీరో..!

కాంట్రాక్టు అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు.!

 ఏపీలో కొత్త ‘స్ట్రెయిన్’ కలవరం.. యూకే నుంచి వచ్చినవారిలో నలుగురికి పాజిటివ్.!