ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య.. నిన్న ఒక్క రోజులో కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

|

Dec 27, 2020 | 10:53 AM

Coronavirus Cases World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ..

ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య.. నిన్న ఒక్క రోజులో కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
Follow us on

Coronavirus Cases World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూపోతోంది. నిన్న ఒక్క రోజు 4,51,472 పాజిటివ్ కేసులు, 7,111 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు 8 కోట్ల మార్క్ దాటాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,720,204కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,764,697 మంది కరోనాతో మరణించారు. ఇక 56,911,211 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (Coronavirus Active Cases In World)

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 19,433,847కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 339,921 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం ‘స్ట్రెయిన్’ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇండియాలో ఇప్పటివరకు 10,188,392 పాజిటివ్ కేసుల కేసులు నమోదు కాగా.. 147,659 మంది వైరస్ కారణంగా మరణించారు. (Coronavirus Cases In World Wide)