India Vs Australia 2020: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఘనత… గిల్‌క్రిస్ట్‌ రికార్డు బ్రేక్…

మెల్‌బోర్న్ వేదికగా సాగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో రికార్డులు నమోదవుతున్నాయి. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ టిమ్ పైన్ ఈ మ్యాచ్ ద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

India Vs Australia 2020: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఘనత... గిల్‌క్రిస్ట్‌ రికార్డు బ్రేక్...
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2020 | 10:55 AM

మెల్‌బోర్న్ వేదికగా సాగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో రికార్డులు నమోదవుతున్నాయి. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ టిమ్ పైన్ ఈ మ్యాచ్ ద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో తక్కువ మ్యాచుల్లో 150 వికెట్లు సాధించిన వికెట్ కీపర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు.

150 వికెట్లు ఎవరు ఎన్ని ఇన్నింగ్స్‌ల్లో సాధించారంటే…

సౌత్ ఆఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ 150 వికెట్లను 38 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. అయితే ఈ రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ బ్రేక్ చేశాడు. కేవలం 36 ఇన్నింగ్స్‌లో 150 వికెట్లు సాధించాడు. అయితే గిల్లీ రికార్డును సౌత్ ఆఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ డికాక్ బద్దలుకొట్టాడు. అతడు కేవలం 34 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించాడు. ఇప్పడు ఈ రికార్డును తిరిగి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ టిమ్ పైన్ 33 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించేశాడు. దీంతో అతి తక్కువ టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 150 వికెట్లు సాధించిన వికెట్ కీపర్ల జాబితాలో టిమ్ అగ్రస్థానంలో ఉన్నాడు.