ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!
Coronavirus Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు విపరీతంగా బయటపడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,276 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,216కి చేరింది. ఇందులో 89,389 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,52,638 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా వైరస్ కారణంగా 97 మంది మరణించగా.. రాష్ట్రంలో […]

Coronavirus Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు విపరీతంగా బయటపడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,276 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,216కి చేరింది. ఇందులో 89,389 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,52,638 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా వైరస్ కారణంగా 97 మంది మరణించగా.. రాష్ట్రంలో మృతుల సంఖ్య 3189కి చేరుకుంది. అటు నిన్న ఒక్క రోజే 61,469 టెస్టులు నిర్వహించగా.. మొత్తం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 31,91,326 కరోనా పరీక్షలు జరిగాయి.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా తూర్పుగోదావరిలో 1321 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత చిత్తూరులో 1220 కేసులు, పశ్చిమ గోదావరిలో 1033, అనంతపురంలో 1020 కేసులు నమోదయ్యాయి. అటు గుంటూరులో 719, కడప 539, కృష్ణ 232, కర్నూలు 850, నెల్లూరు 943, ప్రకాశం 693, శ్రీకాకుళం 661, విశాఖపట్నం 540, విజయనగరంలో 505 కేసులు బయటపడ్డాయి.
Also Read:
ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!
Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!
సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..




