తెలంగాణలో కొత్తగా 1593 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 1593 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది.

తెలంగాణలో కొత్తగా 1593 కరోనా కేసులు..

Edited By:

Updated on: Jul 26, 2020 | 12:35 PM

Corona Cases In Telangana: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 1593 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. కాగా కొత్తగా ఎనిమిది మంది వైరస్ కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 54,059కి చేరగా.. మృతుల సంఖ్య 463కి చేరుకుంది. నిన్న 998 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 41,332 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణలో 12,264 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 15,654 టెస్టింగ్స్ జరగ్గా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,53,425 మందికి టెస్టులు జరిగాయి.

ఇక జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో అత్యధికంగా 640 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 171, వరంగల్‌ అర్బన్‌ 131, మేడ్చల్‌ 91, కరీంనగర్‌ 51, నాగర్‌కర్నూల్‌ 46, ఆదిలాబాద్‌ 14, భద్రాద్రి 17, జగిత్యాల 2, జనగామ 21, భూపాలపల్లి 3, జోగులాంబ గద్వాల 5, కామారెడ్డి 36, ఖమ్మం 18, మహబూబ్‌నగర్ 38, మహబుబాబాద్ 29, మంచిర్యాల 27, మెదక్ 21, ములుగు 12, నల్లగొండ 6, నారాయణపేట 7, నిర్మల్ 1, నిజామాబాద్‌ 32, పెద్దపల్లి 16, సిరిసిల్ల 27, సంగారెడ్డి 61, సిద్దిపేట 5, సూర్యాపేట 22, వికారాబాద్ 9, వనపర్తి 1, వరంగల్‌ రూరల్ 21, యాదాద్రి భువనగిరిలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల విలువ భారీగా పెంపు.!

కిమ్ ఇలాకాలో మొదటి కరోనా కేసు.. ఆ నగరంలో కఠిన లాక్‌డౌన్..!

ఏపీలోని ఆ ప్రాంతంలో వారం రోజుల లాక్‌డౌన్..

గుడ్ న్యూస్.. కరోనా కట్టడికి మరో 21 మందులు..!