తెలంగాణలో 40 వేలకు చేరువైన కరోనా కేసులు..

|

Jul 15, 2020 | 10:33 PM

Coronavirus Cases In Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్క హైదరాబాద్‌లోనే 796 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్  కేసుల సంఖ్య 39,342కి చేరింది. ఇందులో 12,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,159 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తంగా 25,999 మంది ఇప్పటివరకు […]

తెలంగాణలో 40 వేలకు చేరువైన కరోనా కేసులు..
Follow us on

Coronavirus Cases In Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్క హైదరాబాద్‌లోనే 796 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్  కేసుల సంఖ్య 39,342కి చేరింది. ఇందులో 12,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో 1,159 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తంగా 25,999 మంది ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ 11 మంది కరోనాతో మృతిచెందగా.. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 386కి చేరింది. కాగా ఇవాళ జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 796 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్ జిల్లాలో 115, సంగారెడ్డిలో 73,  ఖమ్మంలో 6,  కామారెడ్డిలో 30, వరంగల్ అర్బన్‌లో 44, కరీంనగర్‌లో 41, యాదాద్రిలో 13, మహబూబాబాద్‌లో 5, పెద్దపల్లిలో 20, మెదక్‌లో 18, మంచిర్యాలలో 26, భద్రాద్రి కొత్తగూడెంలో 7, జయశంకర్ భూపాలపల్లి 15, నల్గొండలో 58, రాజన్న సిరిసిల్లలో 6, ఆదిలాబాద్‌లో 1, నాగర్‌కర్నూలు జిల్లాలో 5, నారాయణపేట్ జిల్లాలో 5, వికారాబాద్ జిల్లాలో 5, జనగాం జిల్లాలో 8, నిజామాబాద్ జిల్లాలో 13, వనపర్తి జిల్లాలో 5, సిద్దిపేట జిల్లాలో 27, సూర్యాపేట జిల్లాలో 14, గద్వాల జిల్లాలో 4, ములుగులో 4 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.