Corona Virus: కరోనా మహమ్మారి భవిష్యత్తులో ఎలా మారనుందో తెలుసా..? అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..

|

Jan 15, 2021 | 5:36 AM

ఇప్పుడంటే కరోనా పెద్ద మహమ్మారిలా కనిపిస్తోందని కానీ.. మరికొన్ని రోజుల తర్వాత కరోనా సాధారణ జలుబుగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు...

Corona Virus: కరోనా మహమ్మారి భవిష్యత్తులో ఎలా మారనుందో తెలుసా..? అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..
Follow us on

Corona Virus Become Common Cold: ‘ఏంటీ శ్రీను ఈరోజు డల్‌గా కనిపిస్తున్నావు ఏమైంది..? ఏం లేదు.. కరోనా వచ్చింది. అవునా.. మరి ఒక ట్యాబ్లెట్‌ వేసుకోకపోయావు..’ కరోనా వచ్చిందంటే ఇంత సింపుల్‌గా ట్యాబ్లెట్‌ వేసుకోకపోయావా.. అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు చదివింది నిజమే భవిష్యత్తులో కరోనా నిజంగానే ఇంత లైట్‌గా మారనుంది.
ఇప్పుడంటే కరోనా పెద్ద మహమ్మారిలా కనిపిస్తోందని కానీ.. మరికొన్ని రోజుల తర్వాత కరోనా సాధారణ జలుబుగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. SARS-CoV-1 తో పాటు మరో నాలుగు రకాల వైరస్ రకాలపై పరిశోధనలు జరిపినట్లు journal Science వెల్లడించింది. వైరస్ లకు సంబంధించిన వ్యాధి నిరోధక చికిత్సా విధానం, సాంక్రమిక వ్యాధుల అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ప్రస్తుతం విజృంభిస్తోన్న కరోనా వైరస్ తీవ్రత తీరును శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం పాండామిక్‌గా ఉన్న కరోనా వైరస్‌ ఎండిమిక్‌గా మారిన తర్వాత.. దాని తీవ్రత పూర్తిగా తగ్గిపోతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో కూడా ఇజ్రాయిల్ దీనిపై ఓ అంశాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. కొవిడ్ – 19 మహమ్మారిని ఒక సాధారణ జలుబు స్థాయికి తగ్గించే వీలుందని ఆ దేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Also Read: Corona Cases AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..!