AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా భయం..చైనాకు బయల్దేరిన ఎయిరిండియా విమానం

కరోనా వైరస్ ఔట్ బ్రేక్ తో భారత్ మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్ పుట్టిన చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుబడిన సుమారు 400 మంది భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక ఎయిరిండియా విమానం శుక్రవారం ఢిల్లీ నుంచి చైనాకు బయల్దేరింది.  ఇది ఆరు గంటలపాటు ప్రయాణించి చైనా చేరుకుంటుంది. ఈ బృహత్ ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు.. వూహాన్ నుంచి ఇక్కడికి తెచ్చే భారతీయులను ఢిల్లీ, హర్యానాలోని మానెసార్ లలో గల ఆసుపత్రుల్లో […]

కరోనా భయం..చైనాకు బయల్దేరిన ఎయిరిండియా విమానం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 31, 2020 | 4:07 PM

Share

కరోనా వైరస్ ఔట్ బ్రేక్ తో భారత్ మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్ పుట్టిన చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుబడిన సుమారు 400 మంది భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక ఎయిరిండియా విమానం శుక్రవారం ఢిల్లీ నుంచి చైనాకు బయల్దేరింది.  ఇది ఆరు గంటలపాటు ప్రయాణించి చైనా చేరుకుంటుంది. ఈ బృహత్ ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు..

వూహాన్ నుంచి ఇక్కడికి తెచ్చే భారతీయులను ఢిల్లీ, హర్యానాలోని మానెసార్ లలో గల ఆసుపత్రుల్లో 14 రోజులపాటు ఐసోలేషన్ సెంటర్లలో ఉంచుతారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇన్ఫెక్షన్ ముప్పు లేకుండా చూసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటారు. ఈ విమానంలో 5 గురు డాక్టర్లు, ఓ పారా మెడిక్ ఉంటారు. గ్లోవ్స్, మాస్కులు, అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి. వైద్యులు, సిబ్బంది అంతా పూర్తి ప్రొటెక్టివ్ మాస్కులు ధరిస్తారు. వూహాన్ లో కరోనా సోకనివారినే విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు.

ఇక పైలట్లు, వైద్యులు, ఇంజనీర్లు, సిబ్బంది తిరిగి వఛ్చిన అనంతరం వారి ఇళ్ల లోనే వారం రోజులపాటు వేరుగా ఉండాల్సి ఉంటుంది. వీరిలో ఎవరికైనా కరోనా వైరస్ సోకిన లక్షణాలు కనిపించిన పక్షంలో.. వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలిస్తారు. ప్రస్తుతం గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో.. ఈ ఉదయం వరకు ఈ వ్యాధి కారణంగా సుమారు 200 మంది మరణించినట్టు అంచనా. వూహాన్ నుంచి కేరళ వచ్చిన ఓ మహిళను త్రిసూర్ లోని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆ రాష్ట్రంలో దాదాపు 700 మందిపై వైద్య సంబంధ నిఘా ఉంది. కాగా-మన ఎయిరిండియా విమానం వూహాన్ సిటీలో సుమారు రెండు, మూడు గంటలపాటు ఉంటుంది. రేపు తెల్లవారుజామున రెండు గంటలకు తిరిగి భారత్ బయల్దేరుతుంది.

ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!