అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా పాజిటివ్

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన స్వయంగా తన ట్వీటర్‌ ఖాతాలో ప్రకటించారు.

అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా పాజిటివ్

Updated on: Sep 16, 2020 | 1:04 AM

కరోనా రక్కసి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరినీ వీడటం లేదు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన స్వయంగా తన ట్వీటర్‌ ఖాతాలో ప్రకటించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన తన ట్వీట్‌లో తనకు ఎలాంటి కోవిడ్‌ లక్షణాలు లేవని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు.

అయినప్పటికీ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. దీంతో మహమ్మారి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రజలకు సూచించారు. ప్రస్తుతం తాను ఎస్‌ఓపీ నిబంధనల మేరకు క్వారంటైన్‌లో ఉన్నానట్లు చెప్పుకొచ్చారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో కరోనా యాక్టివ్‌ కేసులు సంఖ్య 1756 ఉండగా.. 4531 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జీ అయ్యారు. కరోనా కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు.