తెలంగాణలో 37కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

| Edited By:

Mar 24, 2020 | 11:18 PM

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 37కు చేరింది. ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా పాజిటివ్‌ కేసును గుర్తించారు.

తెలంగాణలో 37కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
Follow us on

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 37కు చేరింది. ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా పాజిటివ్‌ కేసును గుర్తించారు. మణికొండకు చెందిన 64 ఏళ్ల మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మంగళవారం ఒక్క రోజే నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. లండన్‌ నుంచి వచ్చిన కోకాపేట వాసితో పాటు జర్మనీ నుంచి వచ్చిన చందానగర్‌ మహిళకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన బేగంపేట మహిళకు కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో రక్ష పరీక్షలు నిర్వహించారు.