మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..

|

Nov 12, 2020 | 9:46 PM

మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా అభిమానులకు వెల్లడించారు. డాక్టర్లు మూడోసారి నిర్వహించిన..

మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..
Follow us on

Chiranjeevi Corona Negative: మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా అభిమానులకు వెల్లడించారు. డాక్టర్లు మూడోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. మొదటి రిపోర్ట్ faulty కిట్ వల్ల వచ్చిందని వైద్యులు నిర్ధారించినట్లు చిరంజీవి అన్నారు. ఈ సమయంలో తనపై చూపించిన ప్రేమాభిమానాలకు, చేసిన పూజలకు మెగాస్టార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

”కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి.. నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్టులో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేశాను. రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి, నాకే అనుమానం వచ్చి, అపోలో డాక్టర్లను అప్రోచ్ అయ్యాను. వాళ్లు అక్కడ సీటీ స్కాన్ తీసి చెస్ట్‌లో ఎలాంటి ట్రేస్స్ లేవని నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగటివ్ వచ్చాక, మరోసారి, మరో చోట నివృత్తి చేసుకుందామని నేను Tenet Labలో మూడు రకాల కిట్స్‌తో టెస్ట్ కూడా చేయించాను. అక్కడా నెగటివ్ వచ్చింది. ఫైనల్‌గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా RT-PCR టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ faulty కిట్ వల్ల వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో మీరందరూ నాపై చూపించిన అభిమానానికి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.