మౌత్‌వాష్‌ చేసుకుంటే కరోనా మటుమాయం.. వైరస్ వ్యాప్తి అరికట్టవచ్చంటున్న పంజాబ్ నిపుణులు

|

Dec 18, 2020 | 3:02 PM

కరోనా నియంత్రణకు ప్రపంచ దేశాలు కుస్తీ పడుతున్నాయి. తాజాగా కరోనా కట్టడికి క్లోర్‌హెక్సిడైన్‌ మౌత్‌వాష్‌ కూడా ఉపయోగపడుతుందంటున్నారు సైంటిస్టులు. సాధారణంగా వినియోగించే క్లోర్‌హెక్సిడైన్‌ మౌత్‌వాష్‌ కరోనా వైరస్‌ను అదుపు చేయడంలో ఎంతో సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

మౌత్‌వాష్‌ చేసుకుంటే కరోనా మటుమాయం.. వైరస్ వ్యాప్తి అరికట్టవచ్చంటున్న పంజాబ్ నిపుణులు
Follow us on

కరోనా నియంత్రణకు ప్రపంచ దేశాలు కుస్తీ పడుతున్నాయి. తాజాగా కరోనా కట్టడికి క్లోర్‌హెక్సిడైన్‌ మౌత్‌వాష్‌ కూడా ఉపయోగపడుతుందంటున్నారు సైంటిస్టులు. సాధారణంగా వినియోగించే క్లోర్‌హెక్సిడైన్‌ మౌత్‌వాష్‌ కరోనా వైరస్‌ను అదుపు చేయడంలో ఎంతో సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. పంజాబ్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ హెచ్‌ఎస్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌, సీఎస్‌ఐఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోబయల్‌ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ అధ్యయనానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సహకారం అందించింది.

కరోనా వైరస్‌ తొలుత మనిషి ముక్కు, గొంతులో చేరుతుంది. అక్కడి నుంచి శరీరంలోకి వ్యాపిస్తోంది. ‘క్లోర్‌హెక్సిడైన్‌’ తో తయారైన మౌత్‌వాష్‌తో నోరు కడుక్కుని, పుక్కిలించినప్పుడు కరోనా వైరస్‌ చాలా వరకు నశిస్తోందంటున్నారు అధ్యాపకులు. అలాగే, గొంతు నుంచి శరీరంలోకి వ్యాపించే అవకాశాలు తగ్గిపోతున్నాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. 30 సెకన్ల పాటు క్లోర్‌హెక్సిడైన్‌ డైగ్లూకోనేట్‌ మౌత్‌వాష్‌ 0.2% కాన్సెంట్రేషన్‌తో నోరు శుభ్రం చేసుకుంటే, 99.9 శాతం కరోనా వైరస్‌ను నిర్మూలించవచ్చని ల్యాబ్‌ పరీక్షల్లో తేలినట్లు డాక్టర్‌ హెచ్‌ఎస్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌కు చెందిన డాక్టర్‌ ఆశిష్‌ జైన్‌ తెలిపారు. దీనిపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.