రైల్వేలో ఇక నుంచి కాంటాక్ట్‌లెస్‌ టికెటింగ్…

|

Jul 24, 2020 | 2:17 PM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే చేతితో తాకి టికెట్లను చెక్ చేసే విధానానికి రైల్వేశాఖ స్వస్తి పలకనుంది.

రైల్వేలో ఇక నుంచి కాంటాక్ట్‌లెస్‌ టికెటింగ్...
Follow us on

Ticketless Travel In Railway: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే చేతితో తాకి టికెట్లను చెక్ చేసే విధానానికి రైల్వేశాఖ స్వస్తి పలకనుంది. ఎయిర్‌పోర్టుల తరహలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ తనిఖీలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ సరికొత్త విధానం అమలులోకి రానుంది.

ప్రస్తుతం 85 శాతం మంది ప్రయాణీకులు ఆన్‌లైన్‌ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. వాటిపై క్యూఆర్ కోడ్‌ ఉంటుంది. అందుకే ఇక నుంచి రైల్వేస్టేషన్లు, రైళ్లలో టికెట్లను ఈ క్యూఆర్ కోడ్ సహాయంతో టీటీఈ తనిఖీలు చేస్తారని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఇకపై కౌంటర్లలో టికెట్లు కొనుక్కునేవారు క్యూఆర్ పొందవచ్చునని.. వారి ఫోన్లకే క్యూఆర్ కోడ్‌తో ఉన్న లింకును పంపిస్తామన్నారు.

ప్రయాణ సమయంలో వారు అది చూపిస్తే సరిపోతుందని తెలిపారు. రిజర్వుడ్‌, అన్‌ రిజర్వుడ్‌, ప్లాట్ ఫార్మ్ టికెట్లను ఆన్లైన్ ద్వారానే జారీ చేసి.. టికెట్ వినియోగాన్ని తగ్గిస్తామని వీకే యాదవ్ స్పష్టం చేశారు. కాగా, యూపీలోని ప్రయాగ్ రాజ్ రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఈ కాంటాక్ట్ లెస్ టికెట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..!