Corona India: దేశంలో కొత్తగా 22,065 పాజిటివ్ కేసులు, 354 మరణాలు.. 95 శాతానికి చేరుకున్న రికవరీ శాతం..

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,065 పాజిటివ్ కేసులు, 354 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య..

Corona India: దేశంలో కొత్తగా 22,065 పాజిటివ్ కేసులు, 354 మరణాలు.. 95 శాతానికి చేరుకున్న రికవరీ శాతం..

Updated on: Dec 15, 2020 | 11:01 AM

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,065 పాజిటివ్ కేసులు, 354 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 99,06,165కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,39,820 ఉండగా.. ఇప్పటివరకు 94,22,636 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 354 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,43,709 మంది ప్రాణాలు కోల్పోయారు.

అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో తప్పితే మిగిలిన చోట్ల పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 34,477మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 9,93,665 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 15,55,60,655కు చేరింది. దేశంలో 95.12 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 3.43 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. కాగా, గడిచిన ఐదు నెలల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి..

Also Read:

‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండిలా.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైన రోహిత్ శర్మ.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్న హిట్‌మ్యాన్..

మరో చోట ప్రత్యక్షమైన వింత స్థంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..