ఏపీలో కొత్తగా 438 పాజిటివ్ కేసులు, క్రమక్రమంగా తగ్గుతోన్న క్రియాశీల కేసుల సంఖ్య..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 64,236 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 438 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...

ఏపీలో కొత్తగా 438 పాజిటివ్ కేసులు, క్రమక్రమంగా తగ్గుతోన్న క్రియాశీల కేసుల సంఖ్య..
Corona Andhra Pradesh

Updated on: Dec 20, 2020 | 7:03 PM

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 64,236 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 438 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,78,723కి చేరింది. ఇందులో 4202 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,67,445 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 7076కు చేరుకుంది. ఇక నిన్న 589 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,12,60,810 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 20, చిత్తూరు 80, తూర్పుగోదావరి 38, గుంటూరు 54, కడప 14, కృష్ణా 82, కర్నూలు 7, నెల్లూరు 24, ప్రకాశం23, శ్రీకాకుళం 14, విశాఖపట్నం 40, విజయనగరం 20, పశ్చిమ గోదావరి 21 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us