కంటైన్మెంట్ జోన్ల ఎత్తివేత.. ఎందుకో తెలుసా?

|

Apr 25, 2020 | 4:54 PM

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సులో పాల్గొన్న ముస్లింలు ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. వీరు నివసించే ప్రాంతాలను కంటోన్మెంట్ గతంలో గుర్తించి కఠినమైన బ్లాక్ డౌన్ నిబంధనలను అమలుపరిచారు. అయితే శనివారం ఉన్నట్టుండి కొన్ని జోన్లను కంటైన్మెంట్ పరిధి నుంచి తొలగించారు.

కంటైన్మెంట్ జోన్ల ఎత్తివేత.. ఎందుకో తెలుసా?
Follow us on

తెలంగాణలో నమోదవుతున్న కరుణ వైరస్ పాజిటివ్ కేసుల్లో 50 శాతానికిపైగా హైదరాబాద్ మహానగరంలోని రిజిస్టర్ అవుతున్నాయి. దీనికి కారణం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సులో పాల్గొన్న ముస్లింలు ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. వీరు నివసించే ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా గతంలో గుర్తించి కఠినమైన లాక్ డౌన్ నిబంధనలను అమలుపరిచారు. అయితే శనివారం ఉన్నట్టుండి కొన్ని జోన్లను కంటైన్మెంట్ పరిధి నుంచి తొలగించారు.

కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా నియంత్రణలోకి రాకముందే ప్రభుత్వం కన్టైన్మెంట్ జోన్ల సంఖ్యను కుదించడంలో ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో నిన్నటి వరకు 204 కంటైన్మెంట్ జోన్లు ఉండగా శనివారం వాటి నుంచి 45 జోన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు పరచడం వల్లనే సత్ఫలితాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే 45 ప్రాంతాలను కంటైన్మెంట్ పరిధిలో నుంచి తొలగించామని చెబుతున్నారు.

గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిహెచ్ఎంసి తెలిపింది. కొన్ని జోన్లలో గత 14 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదు కాకపోవడంతో ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ పరిధి నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రాంతాలలో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు. కుత్బుల్లాపూర్ ఏరియాలో మూడు ఏరియాలను కంటైన్మెంట్ జోన్ పరిధి నుంచి మినహాయించారు.