రేపే బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, పాట్నాకు కాంగ్రెస్ నేతల పరుగులు

| Edited By: Pardhasaradhi Peri

Nov 09, 2020 | 11:56 AM

బీహార్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. లెఫ్ట్ పార్టీలతో కలిసి ఆర్జేడీతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. కాగా  విజేతలయ్యే తమ పార్టీ సభ్యులను జేడీ-యూ, బీజేపీ కూటమి ప్రలోభపెట్టి, బేరసారాలకు దిగి తమ వైపు తిప్పుకోవచ్ఛునని భావిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. పార్టీ జనరల్ సెక్రటరీలైన అవినాష్ పాండే, రణదీప్ సింగ్ సూర్జేవాలాలను హుటాటీన పాట్నాకు […]

రేపే బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, పాట్నాకు కాంగ్రెస్ నేతల పరుగులు
Follow us on

బీహార్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. లెఫ్ట్ పార్టీలతో కలిసి ఆర్జేడీతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. కాగా  విజేతలయ్యే తమ పార్టీ సభ్యులను జేడీ-యూ, బీజేపీ కూటమి ప్రలోభపెట్టి, బేరసారాలకు దిగి తమ వైపు తిప్పుకోవచ్ఛునని భావిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. పార్టీ జనరల్ సెక్రటరీలైన అవినాష్ పాండే, రణదీప్ సింగ్ సూర్జేవాలాలను హుటాటీన పాట్నాకు పంపారు. ‘పోస్ట్-రిజల్ట్ రిలీజ్ మేనేజ్ మెంట్’ లో భాగంగా వీరు.. తమవాళ్లు ‘చేజారిపోకుండా’ అన్ని జాగ్రత్తలూ తీసుకోనున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో విపక్షాలతో కూడిన మహా ఘట్ బంధన్, పాలక కూటమి..జేడీ-యూ, బీజేపీ, దాని  మిత్ర పక్షాల మధ్య గట్టి పోటీ ఉంటుందని, కానీ మహాఘట్ బంధన్ దే పైచేయిగా అవుతుందని వెల్లడైంది.