రూటు మార్చిన రాజగోపాల్ రెడ్డి.. అదంతా వదంతే..!

| Edited By:

Jun 24, 2019 | 11:30 AM

పార్టీ పై, పార్టీ అధిష్టానం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలకు సిద్దమైంది. తాజాగా తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్దమైంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల గాంధీభవన్‌లో భేటీ అయిన పీసీసీ, క్రమశిక్షణా కమిటీ సభ్యులు రాజగోపాల్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని పై చర్చించారు. పార్టీపై ఆయన చేసిన విమర్శలను మరోసారి […]

రూటు మార్చిన రాజగోపాల్ రెడ్డి.. అదంతా వదంతే..!
Follow us on

పార్టీ పై, పార్టీ అధిష్టానం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలకు సిద్దమైంది. తాజాగా తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్దమైంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల గాంధీభవన్‌లో భేటీ అయిన పీసీసీ, క్రమశిక్షణా కమిటీ సభ్యులు రాజగోపాల్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని పై చర్చించారు. పార్టీపై ఆయన చేసిన విమర్శలను మరోసారి పరిశీలించిన అనంతరం జగ్గారెడ్డితో ఫోన్ సంభాషణ పై కూడా వివరణ తీసుకున్నారు. ఆ తరువాత రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని అధిష్టానానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి తాము పార్టీ పై విమర్శలు చేయలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను కేవలం పీసీసీ పీఠాన్ని మాత్రమే అడుగుతున్నానని చెప్పుకొచ్చారు. ఇక తాను బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు.