అసలు తుపాకీని ఎవరు ఉపయోగించొచ్చు.. తుపాకీ పొందాలంటే ఏం చేయాలి? ఆదిలాబాద్ ఘటన నేపథ్యంలో పూర్తి వివరాలు.

అసలు లైసెన్స్ తుపాకులను ఎవరికి ఇస్తారు.? చట్టం ఏం చెబుతోంది.. లైసెన్స్‌కు ఏం కావాలి.. లైసెన్స్ పొందిన తర్వాత ఏం జరుగుతుంది.. గన్‌ లైసెన్స్‌ల పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..

అసలు తుపాకీని ఎవరు ఉపయోగించొచ్చు.. తుపాకీ పొందాలంటే ఏం చేయాలి? ఆదిలాబాద్ ఘటన నేపథ్యంలో పూర్తి వివరాలు.
Follow us

|

Updated on: Dec 19, 2020 | 5:47 PM

complete details about license gun: ఆదిలాబాద్‌లో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఇద్దరిని తుపాకీతో కాల్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లైసెన్స్ తుపాకీల చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలోనూ పలువురు సెలబ్రిటీలు తమ తుపాకీలను ఇష్టారాజ్యంగా ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ క్రమంలో అసలు లైసెన్స్ తుపాకులను ఎవరికి ఇస్తారు.? గన్‌ లైసెన్స్‌ల పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..

చట్టం ఏం చెబుతోందంటే.. భారతదేశ పౌరుడు గన్ లైసెన్స్‌ను 1959 నాటి ఆయుధ చట్టం ప్రకారం పొందాల్సి ఉంటుంది. భారతీయులకు కేవలం ఎన్‌పీబీ తుపాకులను మాత్రమే కొనుగోలు చేయడానికి అధికారం ఉంది. లైసెన్స్ పొందాలనుకునే వ్యక్తి ప్రాణాలకు పెద్ద ముప్పు ఉంటేనే తుపాకీ లైసెన్స్ పొందడానికి అనుమతి ఉంటుంది. ఆత్మ రక్షణ కోసం తప్ప మరే సందర్భంలోను తుపాకీ వినియోగించకూడదు.

లైసెన్స్‌కు ఇవి తప్పనిసరి.. లైసెన్స్ పొందాలనుకునే వ్యక్తి కచ్చితంగా ఎఫ్ఐఆర్ (మొదటి సమాచార నివేదిక) సమర్పించాలి. తుపాకీ కావాలనుకుంటే మొదట దరఖాస్తును రాష్ట్ర పోలీసు జిల్లా సూపరింటెండెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరించిన తర్వాత పోలీసులు విచారణ చేపడతారు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతారు. సదరు వ్యక్తి పేర్కొన్న చిరునామా సరైందేనా అని చూస్తారు. అనంతరం చుట్టు పక్కల వారి నుంచి వ్యక్తి గురించి అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, శారీరక ఆరోగ్యంపై కూడా విచారణ చేపడతారు. గన్ లైసెన్స్ కోసం అభ్యర్థించే వ్యక్తి.. డిసిపి ఆధ్వర్యంలో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. తుపాకీ ఆత్మ రక్షణ కోసమా.. మరేదైనా కారణమా అన్న కోణంలో విచారిస్తారు. ఇవన్నీ పూర్తయ్యాక గన్ లైసెన్స్‌ను అందిస్తారు.

లైసెన్స్ పొందిన తర్వాత.. తుపాకీ లైసెన్స్ పొందిన తర్వాత వినియోగదారుడు కచ్చితంగా తుపాకీ డీలర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. కస్టమర్ తమకు నచ్చిన ఏదైనా లైసెన్స్ పొందిన దుకాణం నుంచి తుపాకీని పొందడానికి ప్రీ-ఆర్డర్ బుక్ చేసుకోవాలి. మనదేశంలో తుపాకీని పొందడానికి రెండు నెలల సమయం పడుతుంది. లైసెన్స్ రెనివల్ చేసుకునే సమయంలో కచ్చితంగా తుపాకీ చూపించాల్సి ఉంటుంది.