భయంతో వణుకుతున్న గిరిజనం.. మన్యంలో తుపాకుల మోత

ప్రశాంతంగా ఉండే మన్యంలో మళ్లీ అలజడి రేగుతోంది. పోలీసులు,మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరులో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏపాపం తెలియని అమాయక గిరిజనుల్ని ఇన్‌ఫార్మర్ల పేరుతో మావోస్టులు పొట్టన పెట్టుకుంటున్నారు. 20 రోజుల వ్యవధిలో ముగ్గురు ఈవిధంగా ప్రాణాలు పోగొట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రతీకారంతో చేసినవేనని మావోయిస్టులు ప్రకటించడంతో ఏక్షణంతో ఏంజరగుతుందో తెలియక అడవిబిడ్డలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. విశాఖ మన్యంలో మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, శివేరి సోమలను మావోయిస్టులు పట్టపగలే దారుణంగా హత్య చేశారు. […]

భయంతో వణుకుతున్న గిరిజనం.. మన్యంలో తుపాకుల మోత

Edited By:

Updated on: Jul 31, 2019 | 3:04 PM

ప్రశాంతంగా ఉండే మన్యంలో మళ్లీ అలజడి రేగుతోంది. పోలీసులు,మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరులో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏపాపం తెలియని అమాయక గిరిజనుల్ని ఇన్‌ఫార్మర్ల పేరుతో మావోస్టులు పొట్టన పెట్టుకుంటున్నారు. 20 రోజుల వ్యవధిలో ముగ్గురు ఈవిధంగా ప్రాణాలు పోగొట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రతీకారంతో చేసినవేనని మావోయిస్టులు ప్రకటించడంతో ఏక్షణంతో ఏంజరగుతుందో తెలియక అడవిబిడ్డలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

విశాఖ మన్యంలో మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, శివేరి సోమలను మావోయిస్టులు పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఆతర్వాత అడవిలో కూంబింగ్‌లు, ఎన్‌కౌంటర్లు. అప్పటినుంచి గిరిజనం భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏంజరుగుతుందో అర్ధంకాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు అడవి బిడ్డలు.

మరోవైపు ఐదేళ్ల క్రితం జరిగిన దాడులకు ప్రతీకారంగా దాడుల చేస్తున్నారు మావోయిస్టులు. విశాఖ మన్యంలో జరుగుతున్న ప్రతీకార హత్యలపై గిరిజనులు భయపడుతున్నారు .మావోయిస్టులను టార్గెట్ చేస్తూ ప్రత్యేక దళాలు అడవిని జల్లెడపడుతూ కూంబింగ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us