Colour Photo movie release: హృదయ కాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలతో సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన సూపర్‌హిట్ నిర్మాణసంస్థ అమృత ప్రొడక్షన్ బ్యానర్‌పై సాయి రాజేష్, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా.. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కలర్ ఫొటో’. సుహాస్, చాందీని చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు సునీల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. వైవా హర్ష మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతం అందించాడు. కాగా, ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’లో ఈ మూవీని అక్టోబర్ 23న విజయదశమి కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు ముహూర్తం ఫిక్స్ చేశారు.
Also Read:
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!
బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్
కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!