
Colour Photo fame Suhas New Movie: షార్ట్ మూవీస్‌తో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు సుహాస్. తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్.. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం ఈ సినిమాలోనే కాకుండా ఇతర తెలుగు చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు.
ఇక కలర్ ఫొటో చిత్రంతో హీరోగా ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడీ యంగ్ హీరో. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో సుహాస్ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా సుహాస్ మరో చిత్రంలో నటించనున్నాడు. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1వ తేదీన సుహాస్ కొత్త చిత్ర పోస్టర్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. యూట్యూబ్ ఛానల్‌గా మొదలైన ఛాయ్ బిస్కట్ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లహరి ఫిలిమ్స్‌తో కలిసి కొత్త సినిమాలు నిర్మించే పనిలో పడ్డాయి. తాజాగా ఈ బ్యానర్‌లో సుహాస్ హీరోగా ‘రైటర్ పద్మభూషణ్’ పేరుతో ఓ సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఇందులో సుహాస్ రచయితగా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలైన సుహాస్ హీరోగా ఏ స్థాయికి చేరుకుంటాడో ఈ కొత్త చిత్రం నిర్ణయించనుందన్నమాట.
Also Read: Rhea Chakraborty : మళ్లీ కెమెరా ముందుకు రానున్న సుశాంత్ ప్రేయసి… సినిమాతోపాటు రియాలిటీ షో కూడా..