Rhea Chakraborty : మళ్లీ కెమెరాముందుకు రానున్న సుశాంత్ ప్రేయసి… సినిమాతోపాటు రియాలిటీ షో కూడా..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం దేశం మొత్తాన్ని కదిలించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఆయన అభిమానులు..

Rhea Chakraborty : మళ్లీ కెమెరాముందుకు రానున్న సుశాంత్ ప్రేయసి... సినిమాతోపాటు రియాలిటీ షో కూడా..
Follow us

|

Updated on: Jan 01, 2021 | 7:31 PM

Rhea Chakraborty : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం దేశం మొత్తాన్ని కదిలించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణానికి ఆతడి ప్రేయసి, నటి రియాచక్రవర్తి కారణమని సుశాంత్ అభిమానులు, సుశాంత్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సుశాంత్ మరణంలో డ్రగ్స్ కోణం బయటపడింది.

డ్రగ్స్ వ్యవహారంలో రియాను ఎన్సీబీ అధికారులు విచారించి అరెస్ట్ కూడా చేసారు. నెల రోజుల పాటు ఆమెను జైల్లో ఉంచారు. ఆతర్వాత బెయిల్ పై విడుదలై బయటకు వచ్చింది రియా. ఇక ఇదే కేసులోఆమె సోదరుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సుశాంత్ చనిపోవడం, ఆతర్వాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంతో రియా డిప్రషన్ లోకి వెళ్లిందట. ఇప్పుడిప్పుడే ఆమె సాధారణ స్థితికి వస్తుందట. అయితే రియా మెల్లగా మామూలు మనిషి అవుతోందని వచ్చే ఫిబ్రవరిలో తిరిగి షూటింగ్ లో పాల్గొంటుందని బాలీవుడ్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతుంది. రియా ఇప్పటికే హిందీలో ఒక చిన్న బడ్జెట్ సినిమాకు సంతకం చేసిందట. ఆ సినిమాతో పాటు టీవీషోలో కూడా పాల్గొనబోతుందని తెలుస్తుంది.

also read : SitaraGhattamaneni : మొదటిసారి మీడియా ముందుకు మహేష్ ముద్దుల కూతురు.. చాలా సెక్రెట్స్ బయటపెట్టిన సితార