Cold Moon 2020: ఈ ఏడాది ముగిసే లోపు క‌నువిందు చేయ‌నున్న అరుదైన పూర్ణ చంద‌మామ‌.. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమిటి..?

అంతరిక్షంలో ఎన్నో అద్బుతాలు జ‌రుగుతుంటాయి. కానీ కొన్ని అద్భుతాలు మ‌న‌కు క‌నిస్తాయి.. కొన్ని క‌నిపించ‌వు. అవి క‌నిపించిన స‌మ‌యంలో చూడాలి. లేక‌పోతే అద్భుత‌మైన అవ‌కాశాలు మిస్సైన‌ట్లే. మరి అరుదైన పూర్ణ చందమామ విశేషాలు ....

Cold Moon 2020: ఈ ఏడాది ముగిసే లోపు క‌నువిందు చేయ‌నున్న అరుదైన పూర్ణ చంద‌మామ‌.. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమిటి..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 31, 2020 | 1:57 PM

అంతరిక్షంలో ఎన్నో అద్బుతాలు జ‌రుగుతుంటాయి. కానీ కొన్ని అద్భుతాలు మ‌న‌కు క‌నిస్తాయి.. కొన్ని క‌నిపించ‌వు. అవి క‌నిపించిన స‌మ‌యంలో చూడాలి. లేక‌పోతే అద్భుత‌మైన అవ‌కాశాలు మిస్సైన‌ట్లే. మరి అరుదైన పూర్ణ చందమామ విశేషాలు తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అత్యంత చలి గాలులు వీయ‌నున్నాయి. ఉత్తర భారత్ నుంచి అవి దక్షిణం వైపు వస్తూ…. వెన్నులో వణుకు పుట్టించబోతున్నాయి. అయితే ఇదే సమయంలో చందమామ నుంచి మనకు ఓ శుభ‌వార్త వినిపిస్తోంది. ఈ ఏడాది ముగిసే లోపు చంద్రుడు మనకు సంపూర్ణంగా కనిపించబోతున్నాడ‌ట‌. దీనినే డిసెంబర్ ఫుల్ మూన్ అంటున్నారు. అంటే ఈ నెలలో రాబోతున్న సంపూర్ణ చందమామ అన్నమాట. అయితే ఇందులో ప్రత్యేకత ఏముంది… ప్రతీ నెలలో వస్తూనే ఉంటుంది కదా అనే సందేహం ప్ర‌తి ఒక్క‌రిలో కల‌గ‌క‌మాన‌దు. ఈసారి వచ్చే ఫుల్ మూన్‌కి 4 ప్రత్యేకతలు ఉన్నాయి.

1.ఇది ఈ సంవత్సరంలో చివరి ఫుల్ మూన్. 2.ఇది అత్యంత చల్లటి గాలులు వస్తున్న సమయంలో వస్తోంది. అందుకే మంచు వాతావరణంలో సరికొత్తగా కనిపిస్తుంది. 3.డిసెంబర్ 21 నుంచి పగటి సమయం కంటే రాత్రి సమయం కాస్త పెరుగుతోంది. ఈ ఫుల్ మూన్… రాత్రి సమయం ఎక్కువగా ఉన్న రోజుల్లో రాబోతోంది. 4.ఈ చందమామను అమెరికాలో లాంగ్ నైట్స్ మూన్, కోల్డ్ మూన్ అని పిలుస్తున్నారు. క్రిస్మస్ పండ‌గ అనంత‌రంవచ్చే సంపూర్ణ చందమామను అలా పిలుస్తారు.

అయితే డిసెంబర్ 21న గురుగ్రహం పక్కనే శనిగ్రహం కనిపించింది. దాన్ని క్రిస్మస్ స్టార్ అని పిలిచారు. 2020 చివర్లో వచ్చే ఈ కోల్డ్ మూన్… ఈ సంవత్సరంలో వచ్చిన 13వ సంపూర్ణ చందమామ. ఇది వరుసగా రెండు రోజులు కనిపిస్తుంది. మొదటిది డిసెంబర్ 29న మంగళవారం రాత్రంతా కనిపిస్తుంది. మంగళవారం కంటే… బుధవారం ఇంకా సంపూర్ణంగా ఉన్న చందమామ కనిపిస్తుంది. దీనిని భారతదేశంలోని అందూ చూడవచ్చ.

డిసెంబర్ 29న రాత్రి 10.30 గంటలకు సంపూర్ణ చందమామ అమెరికాలో మొదలవుతుంది. భారతీయులకు మాత్రం డిసెంబర్ 30 ఉదయం 8.58కి మొదలవుతుంది. అయితే 29 రాత్రి, 30 రాత్రి వేళ చందమామ సంపూర్ణంగానే కనిపిస్తుంది. ఈ రెండ్రోజులూ టెలీస్కోప్ ద్వారా చూస్తే చందమామ ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందుకు కారణం… గాలిలో ఉండే మంచే అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కంటికి కనిపించని అతి చిన్న మంచు కణాలు… గాలిలో ఎగురుతూ చందమామను మెరిసేలా చేస్తాయని పేర్కొంటున్నారు.

Latest Articles
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట..
భక్తులకు ఆవుల దత్తత.. తీసుకోవాలంటే ఏం చేయాలి..?
భక్తులకు ఆవుల దత్తత.. తీసుకోవాలంటే ఏం చేయాలి..?
రన్నింగ్ బస్సులోనే రచ్చ.. పక్కన జనాలు ఉన్నారన్న పోయి కూడా లేదు
రన్నింగ్ బస్సులోనే రచ్చ.. పక్కన జనాలు ఉన్నారన్న పోయి కూడా లేదు
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు..ఆ తర్వాత జరిగింది?
వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు..ఆ తర్వాత జరిగింది?
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న క్రాస్ ఓటింగ్..!
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న క్రాస్ ఓటింగ్..!
గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే శుభం అంటే..
సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే శుభం అంటే..
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోన్న దేవయాని
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోన్న దేవయాని