అవినీతి నిర్మూలనకు సీఎం జగన్ కీలక నిర్ణయం..

ఏపీలో అవినీతిని కట్టడి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అవినీతి నిర్మూలనకు సీఎం జగన్ కీలక నిర్ణయం..

Updated on: Aug 24, 2020 | 11:49 PM

Corruption Eradication In AP: ఏపీలో అవినీతిని కట్టడి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెండర్ విలువ కోటి దాటితే రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో అవినీతి నిర్మూలనపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు కీలక ఆదేశాలను జారీ చేశారు.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

మరోవైపు లంచం తీసుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారిపై నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేయాలన్నారు. దిశ తరహాలోనే ఇందుకు కూడా ఓ ప్రత్యేక బిల్లును రూపొందించి అసెంబ్లీలో పాస్ చేయాలని సీఎం జగన్ అన్నారు. ఇక నుంచి 1902 నెంబర్‌కు వచ్చే అవినీతికి సంబంధించిన కాల్స్ వివరాలను ఏసీబీకి చెందిన 14400 నెంబర్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే అవినీతి ఫిర్యాదులను కూడా స్వీకరించాలని.. వాటిపై వెంటనే చర్యలు కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ తెలిపారు. అటు ప్రజలు అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు 14400 నెంబర్ ను ప్రచారం చేయాలని.. సచివాయల్లో పోస్టర్లు, హోర్డింగ్స్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఇక అహ్మదాబాద్‌కు చెందిన ఐఐఎం గుడ్ గవర్నెన్స్‌పై సీఎం జగన్‌కు నివేదికను సమర్పించింది. ప్రొఫెసర్ ఎస్. నారాయణ స్వామి అధ్వర్యంలో ఈ నివేదికను తయారు చేయగా.. ఏసీబీపై సమీక్ష సందర్భంగానే ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..