హరితహారానికి ఈ నెల 25న సీఎం కేసీఆర్ శ్రీకారం

హ‌రిత‌హారం ఆరో విడత కార్య‌క్ర‌మానికి ఈ నెల 25న సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ లో మొక్కలు నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

హరితహారానికి ఈ నెల 25న సీఎం కేసీఆర్ శ్రీకారం

Updated on: Jun 22, 2020 | 8:58 PM

తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపడుతున్న హ‌రిత‌హారం ఆరో విడత కార్య‌క్ర‌మానికి ఈ నెల 25న సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ లో మొక్కలు నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తుండడంతో మరోసారి ఉత్సవంలా చేపట్టాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.

రాష్ర్టంలోని అన్ని జాతీయ‌, రాష్ర్ట ర‌హ‌దారుల వెంబడి నిరంతరాయంగా చెట్ల పెంప‌కం చేపట్టాలన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ప్రగతి భవన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఆదేశించారు. ర‌హ‌దారుల వెంట ప్ర‌తి 30 కిలోమీట‌ర్ల దూరానికి ఒక న‌ర్స‌రీని ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు.

రాష్ట్రంలో పచ్చదనం పెంచాలన్న లక్ష్యంతో ఉన్నామని ప్రకటించిన సీఎం కేసీఆర్ హరితహారాన్ని 2015 జులై 5 న తొలిసారి హైదరాబాద్‍లో ప్రారంభించారు. వేల కోట్ల బడ్జెట్ సైతం కేటాయిస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.