తిరువనంతపురం:ఫెడరల్ ఫ్రంట్ విషయంలో గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ..తాజాగా ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. దీనిలో భాగంగా కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తీరు, ఫలితాల సరళి ఎలా ఉండబోతోంది, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకత, బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలు ఏకమయ్యేందుకు నిర్వహించాల్సిన పాత్ర తదితర అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. సోమవారం ప్రత్యేక విమానంలో కేరళకు బయల్దేరి వెళ్లిన కేసీఆర్.. కుటుంబ సభ్యులతో కలిసి తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకున్న విషయం తెలిసిందే.