పీటముడి పడిన సమస్యలకు కూడా ఇక పరిష్కారం: కేసీఆర్‌

|

Sep 14, 2020 | 3:26 PM

దశాబ్దాలుగా జరుగుతున్న తప్పులను ఒక్కరోజులో సరిదిద్దడం సాధ్యం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సమగ్ర సర్వేనే అన్ని రెవెన్యూ సమస్యలకు పరిష్కారమని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌మండ‌లిలో ప్రవేశపెట్టిన చర్చ అనంతరం సభ్యులు లేవనెత్తిన సందేహాలకు ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఇకపై రిజిస్ట్రేషన్ ధరను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్‌కు మాత్రమే ఎమ్మార్వోకు ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు. ధరణి ఒక్కటే కాదని.. మిగిలిన […]

పీటముడి పడిన సమస్యలకు కూడా ఇక పరిష్కారం: కేసీఆర్‌
Follow us on

దశాబ్దాలుగా జరుగుతున్న తప్పులను ఒక్కరోజులో సరిదిద్దడం సాధ్యం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సమగ్ర సర్వేనే అన్ని రెవెన్యూ సమస్యలకు పరిష్కారమని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌మండ‌లిలో ప్రవేశపెట్టిన చర్చ అనంతరం సభ్యులు లేవనెత్తిన సందేహాలకు ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఇకపై రిజిస్ట్రేషన్ ధరను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్‌కు మాత్రమే ఎమ్మార్వోకు ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు. ధరణి ఒక్కటే కాదని.. మిగిలిన చట్టాలు కూడా ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, కార్మికుల ఇన్‌కం ట్యాక్స్‌ను రద్దు చేయాలని ప్రధానిని కోరామని చెప్పారు. కారుణ్య నియామకాల్లో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. అర్హులుంటే వెంటనే ఉద్యోగాలు ఇస్తామని సీఎం తెలిపారు. రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి, కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్వో వ్యవస్థ రద్దు చేశామని.. దీనిద్వారా పీటముడి పడిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని వివరించారు. అనంత‌రం ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు మండ‌లి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రక‌టించారు. నూత‌న రెవెన్యూ బిల్లుతో పాటు వీఆర్వో పోస్టుల ర‌ద్దు బిల్లుకు, తెలంగాణ మున్సిప‌ల్ నిబంధన స‌వ‌ర‌ణ బిల్లుకు, తెలంగాణ పంచాయ‌తీరాజ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మండ‌లి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది.